జూన్ 22 నుంచి ఆషాడ బోనాలు : మంత్రి తలసాని

Ashada Bonalu from June 22. బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై శ‌నివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన

By Medi Samrat  Published on  26 May 2023 8:57 AM GMT
జూన్ 22 నుంచి ఆషాడ బోనాలు : మంత్రి తలసాని

బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై శ‌నివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జ‌రిగింది. సమావేశానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు హాజ‌ర‌య్యారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలిపారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10 రంగం కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని.. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తలసాని పేర్కొన్నారు.


Next Story