ఆసిఫాబాద్ జిల్లాలో హింసాకాండపై స్పందించిన అసదుద్దీన్

తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన హింసాకాండపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు

By Medi Samrat  Published on  4 Sept 2024 8:37 PM IST
ఆసిఫాబాద్ జిల్లాలో హింసాకాండపై స్పందించిన అసదుద్దీన్

తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన హింసాకాండపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో హింస చెలరేగింది. ఒంటరిగా తన ఊరికి వెళ్తున్న ఆదివాసీ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టారు.

నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విషయం బయటకు రావడంతో సిర్పూర్, జైనూర్​, లింగాపూర్ మండలాల నుంచి పెద్ద ఎత్తున్న ఆదివాసీలు ఆందోళనకు దిగారు. నిందితుడి ఇంటిని ధ్వసం చేశారు. దీంతో జైనూర్​లో ఉద్రిక్తత నెలకొంది.

ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన హింసాకాండపై అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేంద్రతో మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో మత కలహాల సంఘటనల గురించి తెలంగాణ డీజీపీతో మాట్లాడానని అసదుద్దీన్ తెలిపారు. ఉన్నతాధికారులు దీనిని పర్యవేక్షిస్తున్నామని, అదనపు బలగాలను పంపుతున్నామని తెలిపారన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని అసదుద్దీన్ తెలిపారు.

Next Story