పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. శుక్రవారం నాడు మస్జిద్ ఈ వజీర్ అలీలో నిర్వహించిన యూముల్ ఖురాన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, యువకులు సమయం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, దానిని వారి శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రజలు క్రమం తప్పకుండా ఖురాన్ పఠించాలని, జీవితానికి ఎలాంటి హామీ లేదని ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదని ఆయన అన్నారు.
యువత ఫోకస్డ్ గా ఉండాలని తమ కుటుంబాలను మంచిగా చూసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యువత సిగరెట్లు, గుట్కా ఉత్పత్తులు, మాదకద్రవ్యాలు, హుక్కా, వేప్ లకు దూరంగా ఉండాలని కోరారు. యువకులు అల్లాహ్ కు దగ్గరగా వచ్చి అన్ని చెడు అలవాట్లను విడిచిపెట్టాలని సూచించారు.