అసోం సీఎం Vs ఒవైసీ..ఆ వీడియోపై హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీల మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది

By -  Knakam Karthik
Published on : 9 Feb 2026 5:20 PM IST

Telangana, Hyderabad, Asaduddin, Assam CM, Police Complaint

అసోం సీఎం Vs ఒవైసీ..ఆ వీడియోపై హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్

హైదరాబాద్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీల మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అసోం సీఎం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తూ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం హైదరాబాద్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

వివాదానికి కారణమైన ఆ వీడియో ఏంటి?

ఇటీవల అసోం బీజేపీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఒక తుపాకీతో గురిపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు ఉంది. ఆ వీడియోలో కాల్పులకు గురయ్యే వ్యక్తులు ముస్లింల వలె (టోపీ, గడ్డంతో) ఉన్నారని, దానికి "పాయింట్ బ్లాంక్ షాట్" మరియు "నో మెర్సీ" (కనికరం లేదు) అనే క్యాప్షన్లు ఇచ్చారని ఒవైసీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియోను తర్వాత తొలగించినప్పటికీ, ఇది సమాజంలో హింసను ప్రేరేపించేలా ఉందనేది ఒవైసీ వాదించింది.

ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా, రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా సీఎం ప్రవర్తిస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. విద్వేషపూరిత ప్రసంగాల (Hate Speech) విషయంలో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న హిమంత బిస్వా శర్మపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కోరారు.

Next Story