నా ప్రాణం ఉన్నంత వ‌ర‌కు తెలంగాణను ఆగం కానివ్వ‌ను: కేసీఆర్

As long as there is life in my throat, I will protect the state.. CM KCR said. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆగస్ట్ 25న తెలంగాణను తన చివరి శ్వాస వరకు

By అంజి  Published on  25 Aug 2022 3:19 PM GMT
నా ప్రాణం ఉన్నంత వ‌ర‌కు తెలంగాణను ఆగం కానివ్వ‌ను: కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆగస్ట్ 25న తెలంగాణను తన చివరి శ్వాస వరకు మతతత్వ శక్తుల చేతుల్లో పడకుండా కాపాడుతానని ప్రతిజ్ఞ చేశారు. గురువారం ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొంగ‌ర‌క‌లాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలే తన బలమని, వారి ఆశీస్సులతో తెలంగాణను మరింత ప్రగతిపథంలో తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

బీజేపీపై, మత విద్వేష రాజకీయాలు చేస్తోందని కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో బీజేపీ నేతలు, తాజా ఉద్రిక్తతలను ప్రస్తావించిన ఆయన, చౌక, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి సమాజంలో మతపరమైన చీలికలను సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని అన్నారు. సాగుతో అభివృద్ధి చెందే తెలంగాణ కావాలా, మత విద్వేషాలతో చిచ్చురేపుతున్న రాష్ట్రం కావాలా? (పంటలు పండే తెలంగాణ కావాలా, మంటలు మందే తెలంగాణా కావాలా?) అంటూ కేసీఆర్ తన అసమాన శైలిలో కోరారు.

''తెలంగాణ గత ఎనిమిదేళ్లుగా శాంతి, ప్రశాంతతను అనుభవిస్తోంది. రాష్ట్రం వేగంగా పురోగమిస్తోంది. తలసరి ఆదాయం పెరిగింది, సమృద్ధిగా నీరు, 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా.. ఈ రాజకీయ శక్తులు రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మతపరమైన అగ్నిని రాజేస్తూ సామరస్యపూర్వకమైన సామాజిక నిర్మాణం.. నా చివరి శ్వాస వరకు రాష్ట్రాన్ని వారి చేతుల్లోకి రానివ్వను'' అని ఆయన అన్నారు. దేశంలో నిరంకుశ పోకడ చూస్తున్నామ‌న్నారు. ఇలానే చూస్తూ ఉందామా? లేక పిడికిలెత్తి పోరాడుదామా? అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it