బదిలీలలో అవినీతిపై కథనాలు.. మంత్రి సీరియ‌స్‌

ప‌లు పత్రికలలో వచ్చిన వార్త కథనాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  27 July 2024 2:30 PM IST
బదిలీలలో అవినీతిపై కథనాలు.. మంత్రి సీరియ‌స్‌

ప‌లు పత్రికలలో వచ్చిన వార్త కథనాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య బదిలీలలో అవినీతికి పాల్పడిన వారిపై తక్షణం చర్యలు చేపట్టాలని మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు. వైద్య బదిలీలలో భారీ అవినీతి' జరిగిందని పత్రికలో వచ్చిన వార్త కథనాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాఖ కార్యదర్శి ని ఆదేశించారు. బదిలీలలో అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలితే వారు ఏ స్థాయి వారైనా కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని మంత్రి అదేశించారు.

Next Story