మరో 2 నెలల్లో స్కూళ్లకు కొత్త టీచర్లు

టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రెండు నెలల్లో నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.

By అంజి  Published on  14 Aug 2024 1:30 AM GMT
new teachers, schools, Telangana

మరో 2 నెలల్లో స్కూళ్లకు కొత్త టీచర్లు

హైదరాబాద్‌: టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రెండు నెలల్లో నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరులోగా డీఎస్సీ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇంటర్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. గతంలో నిలిచిపోయిన డిగ్రీ లెక్చరర్ల (అసిస్టెంట్‌ ప్రొఫెసర్) నియామక ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి కానున్నట్టు సమాచారం.

కాగా నియామకాలు పూర్తి అయ్యేవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి అనుమతిచ్చింది. కొన్ని పాఠశాలల్లో సరిపడినంత మంది ఉపాధ్యాయుల్లేక చదువులు సాగడం లేదు. ఉపాధ్యాయుల నియామకానికి ఇటీవల డీఎస్సీ నిర్వహించగా, సెప్టెంబరు 5న గురుపూజోత్సవం రోజున నియామకపత్రాలివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలతో పాటు కొత్త టీచర్ల నియామకాలపై కూడా చర్చ జరిగింది.

Next Story