Telangana: 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలు నియామకం

తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు సీనియర్‌ ఐఏఎస్‌లను ఇన్‌ఛార్జ్‌ వీసీలుగా ప్రభుత్వం నియమించింది.

By అంజి  Published on  21 May 2024 6:55 PM IST
incharge vice chancellors, universities, Telangana, Osmania University, Kakatiya University

Telangana: 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలు నియామకం

తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు సీనియర్‌ ఐఏఎస్‌లను ఇన్‌ఛార్జ్‌ వీసీలుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో గత వీసీల పదవీ కాలం ముగిసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2021 మే 22న పది వర్సిటీలకు వీసీలను నియమించింది.

ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానకిషోర్‌, జేఎన్‌టీయూ వీసీగా బి.వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా వాకాటి కరుణ, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీగా రిజ్వి, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సందీప్‌ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజా రామయ్యర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ వీసీగా జయేష్ రంజన్‌, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్, శాతవాహన వర్సిటీ వీసీగా సురేంద్రమోహన్‌ను నియమించింది.

Next Story