ఆగస్టు 11 వరకే రైతు భీమా దరఖాస్తుకు అవకాశం
Applications invites Rythu Bima Scheme in Telangana State.తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయ శాఖ
By తోట వంశీ కుమార్ Published on 6 Aug 2021 10:37 AM ISTతెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయ శాఖ శుభవార్త చెప్పింది. రైతు భీమాకు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని రైతులు, కొత్త పట్టాదారు పొందిన రైతులకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీ లోపు భూములను రిజిస్టర్ చేసుకున్న రైతులు ఈ నెల 11వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలని వ్యవసాయ శాఖ సూచించింది.
నియమ నిబంధనలు :
- రైతు భూమి 03.08.2021 లోపు రిజిస్టర్ చేసుకొని ఉండాలి
- రైతులు 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అంటే 14.08.1962 నుండి 14.08.2003 మధ్య జన్మించి ఉండాలి.
- వయస్సు పక్కాగా ఆధార్ కార్డ్ ప్రకారమే తీసుకుంటారు. అందులో ఎలా ఉంటే అదే ప్రామాణికం
- ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలో మాత్రమే భీమాకు అవకాశం ఉంటుంది.
- రైతే స్వయంగా వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఏఈఓకు (AEO) కు అందజేయాలి.
- ఏఈఓ మరియు ఎమ్ఏఓ( MAO) లు వాళ్ళ లాగ్ ఇన్ నుండి 12.08.2021 లోపే ఎల్ఐసీ(లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కి పంపాలి. కావున రైతులు 11.08.2021 లోపే అప్లికేషన్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళవి ఆన్‌లైన్ చేయడానికి వీలు అవుతుంది.
- ఇప్పుడు మీరు భీమా చేసుకోకపోతే ఇంకో సంవత్సరం వరకు భీమా చేసుకోవడానికి అవకాశం ఉండదు.
రైతు భీమాకు దరఖాస్తు చేసుకున్న రైతు ఏకారణం చేత మరణించినా.. వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భీమాను తీసుకువచ్చింది. రైతు మరణించిన ఐదు నుంచి పది రోజుల్లో నామిని అకౌంట్‌లో రూ.5 లక్షలు జమ అవుతాయి.