సీఎం కేసీఆర్‌ జన్మ ధన్యమైంది: ఏపీ మంత్రి విశ్వరూప్‌

AP Minister Vishwaroop comments on CM KCR. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని కార్తీక మాసం సందర్భంగా

By అంజి  Published on  6 Nov 2021 12:39 PM GMT
సీఎం కేసీఆర్‌ జన్మ ధన్యమైంది: ఏపీ మంత్రి విశ్వరూప్‌

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ.. ఆలయ పునర్‌ నిర్మాణంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్య ధన్యమైందని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌ అన్నారు. ఆలయానికి వచ్చిన మంత్రి విశ్వరూప్‌కు అర్చకులు ఆలయ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.

అనంతరం విశ్వరూప్‌కు అశ్వీరచనం చేశారు. ఆలయ అధికారులు మంత్రికి తీర్థప్రసాదాలు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి ఆలయాన్ని చూడ చక్కగా తీర్చిదిద్దారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని అన్నారు. కరోనా వైరస్‌ బారిన పడ్డ తమ కుటుంబ సభ్యులు యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి దయతో బయటపడ్డామని మంత్రి విశ్వరూప్‌ అన్నారు.

Next Story
Share it