కొండగట్టులో మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్

కొండగట్టులోని ఆంజనేయస్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు

By Medi Samrat  Published on  29 Jun 2024 3:19 PM IST
కొండగట్టులో మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్

కొండగట్టులోని ఆంజనేయస్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కు పండితులు వేదాశీర్వచనాలు అందించారు. ఎన్నికల ముందు వారాహి వాహనంలో కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు. పవన్ పర్యటన దృష్ట్యా కొండగట్టు అంజన్న క్షేత్రంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

సిద్ధిపేటలో పవన్ అభిమానులు గజమాలతో సత్కరించారు. కారుపైకి ఎక్కి అభిమానులకు పవన్ అభివాదం చేశారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. ఆలయంలో పవన్ కు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. కొండగట్టుకు పవన్ వచ్చిన నేపథ్యంలో, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు అభిమానులు.

Next Story