రంగరాజన్‌పై దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు
By Knakam Karthik Published on 11 Feb 2025 8:53 PM IST![Telugu News, Ap Cm Chandrababu, Hyderabad, Chilkur Balaji Temple, Rangarajan Telugu News, Ap Cm Chandrababu, Hyderabad, Chilkur Balaji Temple, Rangarajan](https://telugu.newsmeter.in/h-upload/2025/02/11/394530-1cbn.webp)
రంగరాజన్‌పై దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు
చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. మనం నాగరిక సమాజంలో హింసకు తావులేదని చంద్రబాబు హితవు పలికారు. భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడుకోవడం సబబు... ఎప్పటికీ ఇదే సరైన మార్గం అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు తావులేదని, హింస ఏ రూపంలో ఉన్నా అది ఆమోదయోగ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
కాగా సీఎస్ రంగరాజన్ పై రామరాజ్యం సంస్థ సభ్యులు దాడి చేయడం తెలిసిందే. చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తమ సంస్థలో చేర్చాలని రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి కోరగా, రంగరాజన్ అందుకు నిరాకరించారు. దాంతో రామరాజ్యం సభ్యులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. రంగరాజన్ పై దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు.
I condemn the heinous incident involving Sri CS Rangarajan Garu, the Chief Priest of Chilkur Balaji Temple. In a civilized society, there must always be room for respectful dialogue and differences of opinion. Violence has no place and must be rejected.
— N Chandrababu Naidu (@ncbn) February 11, 2025