హైదరాబాద్‌లో చెరువుల పునరుద్దరణలో భాగంగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్‌లో మరో ముందడుగు పడింది. తొలి దశలో నగరంలోని 6 చెరువులకు పునరుజ్జీవనం కల్పించేందుకు హైడ్రా చేపట్టిన చర్యలతో బతుకమ్మకుంట అందరిని ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరిలో చెట్ల పొదలు, చెత్త చెదారంతో నిండిపోయి ఉన్న బతుకమ్మ కుంటను హైడ్రా అధికారులు దాన్ని చుట్టూ ఉన్న కబ్జాలు ఇతర అడ్డంకులను తొలిగించి బతుకమ్మ కుంటకు సరికొత్త వైభవంను తీసుకువచ్చారు.
తాజాగా ఏరియల్ వ్యూ ఫోటోలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం విడుదల చేశారు. 5 ఎకరాల్లో ఉన్న ఈ బతుకమ్మకుంట అభివృద్ధికి ఇప్పటి వరకు దాదాపు 7 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. హైడ్రా చేపట్టిన చర్యలతో బతుకమ్మకుంట ఇలా అందరిని ఆకట్టుకుంటుంది. హైడ్రా ఎంపిక చేసిన ఆ ఆరు చెరువుల పునరుద్దరణలో భాగంగా చుట్టూ వాకింగ్ ట్రాక్స్, జిమ్, పిల్లలు ఆడుకునే విధంగా ఏర్పాట్లతో పాటు చుట్టూ ఆహ్లాదకరమైన అనుభూతిని పంచేలా తీర్చిదిద్దనున్నారు. సెప్టెంబర్ నెల వరకు ఈ పనులను పూర్తి చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.