రాజా సింగ్ కు మరో షాక్

Another Shock to Goshamaha MLA Rajasingh. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ బోర్డ్ కీలక తీర్పునిచ్చింది.

By Medi Samrat  Published on  26 Oct 2022 7:15 PM IST
రాజా సింగ్ కు మరో షాక్

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ బోర్డ్ కీలక తీర్పునిచ్చింది. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను విచారించిన కమిటీ దానిని సమర్థించింది. తనపై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను ఎత్తేయాలన్న ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తిని అడ్వైజరీ కమిటి తిరస్కరించింది.

రాజాసింగ్ అప్పీల్ ను తిరస్కరించింది అడ్వెజరీ కమిటీ.. పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ని సమర్థించింది కమిటీ. అతనిపై నమోదైన పీడీయాక్ట్ పై నేడు కమిటీ తీర్పునిచ్చింది. రాజాసింగ్ పై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను కమిటీ సమర్ధించింది. పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని కమిటీ తిరస్కరించింది. రాజాసింగ్ పై 101కేసులు ఉన్నాయని వాటిలో 18 కమ్యూనల్ కేసులు ఉన్నాయని పోలీసులు అడ్వైజరీ కమిటీ దృష్టికి తెచ్చారు. అందుకే పీడీ యాక్ట్ నమోదుచేసినట్లు చెప్పారు. అయితే తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేసినట్టుగా రాజాసింగ్ బోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కమిటీ సభ్యులు పోలీసుల వాదనతో ఏకీభవించారు.

రాజా సింగ్ ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డంతో హైద‌రాబాద్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న కార్యక్రమాలు ర్యాలీలు చేశారు. ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్‌ను ప్రయోగించి జైలుకు పంపారు.పీడీ యాక్ట్ నమోదును వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషా బాయి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను అరెస్ట్ చేసే సమయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.


Next Story