తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పై ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ రాజధాని బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుతాసుపత్రికి తరలించారు. హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు హైదరాబాద్, మరొకరు హన్మకొండకు చెందిన వారిగా గుర్తించారు.
కాగా రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. కర్నూల్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇటు వికారాబాద్ జిల్లాలో ఎక్స్‌ప్రెస్ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో దాదాపు 20 మంది మృతి చెందారు. దీంతో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.