సంగారెడ్డిలో ఫార్మా హబ్.. ఎన్ని వేల ఎకరాల్లో తెలుసా.?

ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం మంచి పురోగతిని సాధిస్తూ ఉంది. సంగారెడ్డి జిల్లాలో 2 వేల ఎకరాల్లో మరో పారిశ్రామిక హబ్ రాబోతోంది.

By Medi Samrat  Published on  2 Aug 2024 9:15 PM IST
సంగారెడ్డిలో ఫార్మా హబ్.. ఎన్ని వేల ఎకరాల్లో తెలుసా.?

ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం మంచి పురోగతిని సాధిస్తూ ఉంది. సంగారెడ్డి జిల్లాలో 2 వేల ఎకరాల్లో మరో పారిశ్రామిక హబ్ రాబోతోంది. హైదరాబాద్, నివాసాలకు దూరంగా ఔషధ పరిశ్రమలను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో.. సంగారెడ్డి జిల్లా యంత్రాంగం, తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGIIC) అనువైన ప్రదేశాన్ని గుర్తించాలని కోరింది. న్యాల్‌కల్‌ మండలంలోని మల్గి, డప్పూర్‌, వడ్డి గ్రామాలకు సమీపంలో జిల్లా యంత్రాంగం స్థలాన్ని గుర్తించింది. ఈ ప్రదేశం కర్ణాటక సరిహద్దు నుండి ఒక కిలోమీటరు దూరంలో, బీదర్ పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పటాన్‌చెరు వద్ద ORR నుండి 100 కి.మీ దూరంలో ఉంది.

కలెక్టర్ సంగారెడ్డి వల్లూరు క్రాంతి, టీజీఐఐసీ పటాన్చెరు జోనల్ మేనేజర్ రథన్ రాథోడ్, డిప్యూటీ కలెక్టర్లు రవీందర్ రెడ్డి, నాగలక్ష్మి, ఆర్డీఓ జహీరాబాద్, రాజు, అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) ఇలేష్ తదితరులు స్థలాన్ని పరిశీలించారు. 1,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని దేవాదాయ శాఖ స్థానిక రైతుల నుండి మరో 1,000 ఎకరాలను సేకరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పనకు 40 శాతం భూమిని వదిలి ప్లాట్లుగా అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన భూమిని ఇక్కడ తమ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే పరిశ్రమలకు కేటాయిస్తారు.

Next Story