తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే రైతు భరోసా పథఖం అమలు చేస్తామని గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ప్రసంగిస్తూ ప్రకటన చేశారు. అమెరికా పర్యటనలో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశం సానుకూలంగా జరిగిందని తెలిపారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. గత ప్రభుత్వం మాదరి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం వేయబోమని సీఎం రేవంత్ తెలిపారు.
అటు రైతు రుణమాఫీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఎం తెలిపారు. పథకానికి అర్హులైన వారందరికీ రుణమాఫీ అవుతుందని మరోసారి సీఎం స్పస్టం చేశారు. ఎవరికైనా సాంకేతిక కారణాల వల్ల మాఫీ కాకపోతే చేయించే బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. రుణమాఫీ వల్ల తమ జన్మ ధన్యమైందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.