సెప్టెంబర్ 15, సోమవారం నాడు వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నివాసం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు తమకు ఆరోగ్య, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. "కడుపు మండిన అంగన్ వాడీలు కొడంగల్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి దాకా వచ్చారు. 22నెలల్లోనే కాంగ్రెస్ పాలన అసలు స్వరూపం బయటపడింది. రేవంతు తెచ్చింది మార్పు కాదు, వట్టి ఏమార్పు అని సుస్పష్టమైంది." అంటూ హరీష్ రావు ట్వీట్ కూడా చేశారు.
కొడంగల్‌లోని ముఖ్యమంత్రి నివాసం వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. హామీలు నెరవేర్చకపోవడంతో వారు ఆందోళన చేస్తున్నారు. గత ప్రభుత్వం వారికి జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాల పెంపుదల హామీ ఇచ్చింది.