బెట్టింగ్ యాప్స్ కేసులో ఆ యాంకర్‌కు రిలీఫ్, అరెస్ట్ నుంచి హైకోర్టు మినహాయింపు
తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట లభించింది.
By Knakam Karthik
బెట్టింగ్ యాప్స్ కేసులో ఆ యాంకర్‌కు రిలీఫ్, అరెస్ట్ నుంచి హైకోర్టు మినహాయింపు
తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట లభించింది. ఆమెను అరెస్టు చేయవద్దంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలకు హైకోర్టు ఆదేశించింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారంలో తనపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని శ్యామల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శ్యామల దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపి.. శ్యామలను అరెస్టు చేయవద్దని విచారించవచ్చునని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
బెట్టింగ్ యాప్ కేసులో పంజాగుట్ట పోలీసులు మొత్తం 11 మంది యూట్యూబర్స్, యాంకర్స్‌పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే... అంతేకాకుండా పోలీసులు వీరందరికీ నోటీసులు ఇచ్చి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కి రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు ఈ క్రమంలోనే యాంకర్ శ్యామల హైకోర్టును ఆశ్రయించింది. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్యాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు శ్యామలను అరెస్టు చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది. సోమవారం నుంచి పోలీసుల ఎదుట హాజరు కావాలని, విచారణకు సహకరించాలని పిటిషనర్ శ్యామలను హైకోర్టు ఆదేశించింది.
నిషేధిత బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసినందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో టీవీ యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూ చౌదరిలను పంజాగుట్ట పోలీసులు గురువారం సుదీర్ఘంగా విచారించారు.