ప్రముఖ యాంకర్ రఘు కిడ్నాప్..!
Anchor Raghu Kidnap. ప్రముఖ తెలుగు యాంకర్, జర్నలిస్ట్ రఘు కిడ్నాప్‌కు గురవ్వడం సంచలమైంది. హైదరాబాద్ లో తొలి వెలుగు
By Medi Samrat Published on 3 Jun 2021 3:32 PM ISTప్రముఖ తెలుగు యాంకర్, జర్నలిస్ట్ రఘు కిడ్నాప్‌కు గురవ్వడం సంచలమైంది. హైదరాబాద్ లో తొలి వెలుగు యాంకర్ రఘును ఉదయం 9 గంటల ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. మల్కాజిగిరిలో రఘు నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. జర్నలిస్ట్ రఘును తెలియని కొందరు వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని జీపులో ఎక్కించారు. రఘు తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా రఘును తీసుకెళ్లారు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
గుర్రం పోడు గిరిజన భూముల అధికార పార్టీ అక్రమాలపై రఘు ఓ జర్నలిస్ట్‌గా అనేక కథనాలు అందించాడు. కోకాపేట కాందిశీకుల భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేయడంతో గతకొన్ని రోజులుగా అతనికి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖబడ్దార్ అంటూ దుండగులు పెద్దపెట్టున కేకలు వేస్తూ రఘును బలవంతంగా జీపు ఎక్కించినట్లు స్థానికులు చెబుతున్నారు.
పీపుల్స్ వాయిస్ గా ఉన్న జర్నలిస్ట్ రఘును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఉదయం 9గంటల సమయంలో మల్కాజ్ గిరిలో తన ఇంటికి సమీపంలో రఘును నెంబర్ ప్లేట్ కూడా లేని వాహనంలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తొలివెలుగు ద్వారా పలు భూకబ్జాలను, ప్రభుత్వ అవినీతిని రఘు వెలుగులోకి తెచ్చారని.. రఘు ఆధారాలతో సహ ప్రచురించిన కథనాలు, చేసిన స్టోరీలు వైరల్ కావటంతో… కొంతకాలంగా రఘుకు కొందరు టార్గెట్ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. జర్నలిస్ట్ రఘు కిడ్నాప్ వార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.