తెలంగాణలో రూ.9500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్న అమర్ రాజా సంస్థ

Amara Raja Batteries to invest Rs.9,500 Cr in Telangana. అమర్ రాజా సంస్థ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. వచ్చే పదేళ్లలో తెలంగాణలో 9500 కోట్ల

By Medi Samrat  Published on  2 Dec 2022 5:02 PM IST
తెలంగాణలో రూ.9500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్న అమర్ రాజా సంస్థ

అమర్ రాజా సంస్థ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. వచ్చే పదేళ్లలో తెలంగాణలో 9500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని అమర్ రాజా సంస్థ ప్రకటించింది. బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమర్ రాజా లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అమర్ రాజా గ్రూప్ మధ్య ఎంవోయూ కుదిరింది. అమర్ రాజా గత 37 ఏండ్లుగా సేవలందిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని.. ఈవీ బ్యాటరీల తయారీలో దేశంలోనే ఇది పెద్ద యూనిట్ అని చెప్పారు. అమర్ రాజా కంపెనీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ఎంపీ గల్లా జయదేవ్ స్పందిస్తూ.. తమ కుటుంబానికి చెందిన అమరరాజా గ్రూప్ తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. నూతన టెక్నాలజీతో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్ ను నెలకొల్పుతున్నామని.. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తోందని గల్లా జయదేవ్ కొనియాడారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామని వివరించారు. దేశంలోని టైర్-2, టైర్-3 నగరాల్లో అమరరాజా గ్రూప్ పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఎక్కడ తమ పరిశ్రమ ఏర్పాటు చేసినా స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన గల్లా జయదేవ్ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.


Next Story