హైదరాబాద్‌లో ఉరుముల, మెరుపులతో వర్షం.. మరో మూడు రోజుల పాటు ఇలాగే..

హైదరాబాద్‌ మహా నగరంలో వర్షం దంచికొడుతున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన

By అంజి  Published on  14 April 2023 8:45 AM IST
Hyderabad , rain , Telangana, IMD

హైదరాబాద్‌లో ఉరుముల, మెరుపులతో వర్షం.. మరో మూడు రోజుల పాటు ఇలాగే..

హైదరాబాద్‌ మహా నగరంలో వర్షం దంచికొడుతున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, మియాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, మూసాపేట్‌, కుత్బుల్లాపూర్‌, సూరారం, జీడిమెట్ల, చింతల్‌, బాలానగర్‌, కొంపల్లి, సుచిత్ర బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తున్నది. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపాలిటీ కార్పొరేషన్‌ సిబ్బంది.. రోడ్లపై ఎక్కడా నీళ్లు నిల్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షపు నీరు ఎక్కడా జామ్‌ కాకుండి డ్రైనేజీ ద్వారా వెళ్లిపోయేలా చూస్తున్నారు. ఈ వర్షం.. ఎండలతో పెరిగిన ఉష్ణోగ్రతల నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.

గురువారం సాయంత్రం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జగద్గిరిగుట్ట, చింతల్‌, బాలానగర్‌, చంపాపేట్‌, సరూర్‌నగర్‌, చైతన్యపురిలో వానపడింది. సైదాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వడగళ్లతో వర్షం కురిసింది. దీంతో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్‌, బేగంపేట, చిలకలగూడ, మారేడుపల్లితో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది.

తూర్పు విదర్భ నుండి మరాత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు సగటు సముద్రం మట్టంకి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దిగువ స్థాయిలో గాలులు ఈ రోజు ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. దీని ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ గురువారం రాత్రి విడుదల చేసిన వెదర్ బులిటెన్‌లో తెలిపింది. నేటి నుంచి 16వ తేదీ వరకు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

Next Story