అల్లు అర్జున్ పై కేసును విత్ డ్రా చేసుకుంటా: రేవతి భర్త

By Medi Samrat  Published on  13 Dec 2024 5:00 PM IST
అల్లు అర్జున్ పై కేసును విత్ డ్రా చేసుకుంటా: రేవతి భర్త

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రేవతి భర్త భాస్కర్ కేసును విత్ డ్రా చేసుకుంటానని మీడియా ముందు తెలిపారు. 'పుష్ప-2' సినిమా చూడాలని తన కొడుకు అడిగితే సంధ్య థియేటర్ కు తీసుకెళ్లానని, జరిగిన దానితో అల్లు అర్జున్ కు సంబంధం లేదని చెప్పారు. అల్లు అర్జున్ పై తాను పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని., ఆసుపత్రిలో తన మొబైల్ లో న్యూస్ చూస్తూ ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు.

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. పుష్ప-2 ప్రీమియర్స్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Next Story