అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి

నటుడు అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

By Medi Samrat  Published on  22 Dec 2024 4:55 PM IST
అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి

నటుడు అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ తన ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. శ్రీ తేజ్‌ను ఆసుపత్రిలో పరామర్శించడానికి అల్లు అర్జున్ లీగల్ టీమ్ అనుమతించకపోవడం హాస్యాస్పదం అని అన్నారు.

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎదురు దాడిగా నటుడు అల్లు అర్జున్ మాట్లాడటం సరికాదని కోమటి రెడ్డి అన్నారు తొక్కిసలాటపై అసెంబ్లీ తన ఇమేజ్ దెబ్బ తీశారని అల్లు అర్జున్ అంటున్నారు.. కానీ సీఎం వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదని.. ఆ రోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించి చెప్పారన్నారు. పోలీసులు వద్దని చెప్పినా అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులతో అల్లు అర్జున్‌ దురుసుగా ప్రవర్తించాడన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన వెళ్లి కనీసం బాధితులను పరామర్శించలేదన్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని మంత్రి తేల్చి చెప్పారు. త్వరలోనే సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ అయ్యి చర్చిస్తామని తెలిపారు.

Next Story