Breaking : అల్లు అర్జున్ విడుదల(వీడియో)

ఎట్టకేలకు సినీ నటుడు అల్లు అర్జున్ జైలు నుండి విడుదలయ్యాడు.

By Kalasani Durgapraveen
Published on : 14 Dec 2024 6:45 AM IST

Breaking : అల్లు అర్జున్ విడుదల(వీడియో)

ఎట్టకేలకు సినీ నటుడు అల్లు అర్జున్ జైలు నుండి విడుదలయ్యాడు. విడుదల ప్రక్రియ ఆలస్యం అవ్వడంతో అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే గడపాల్సి వచ్చింది.

అల్లు అర్జున్ ను విడుదల చేయడానికి, ఆయన న్యాయ బృందం జైలు అధికారులకు 50 వేల రూపాయల పూచీకత్తును సమర్పించింది. శుక్రవారం రాత్రి హైకోర్టు నుండి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందాయి. దీంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ విడుదల అయ్యారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.


Next Story