అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో నమోదైన కేసుకు సంబంధించి అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
క్వాష్ పిటిషన్ అత్యవసరమేమీ కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు. సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు సూపరింటెండెంట్‌కు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.