World Cup 2023 : ప్రపంచ కప్ కోసం ప్రకటించిన మొత్తం 10 జట్లు వివ‌రాలివే..!

వ‌చ్చే నెల మొద‌టి వారంలో భారత్‌లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టోర్నీ అక్టోబర్‌ 5న ప్రారంభం కానుంది.

By Medi Samrat  Published on  29 Sept 2023 3:03 PM IST
World Cup 2023 : ప్రపంచ కప్ కోసం ప్రకటించిన మొత్తం 10 జట్లు వివ‌రాలివే..!

వ‌చ్చే నెల మొద‌టి వారంలో భారత్‌లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టోర్నీ అక్టోబర్‌ 5న ప్రారంభం కానుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి ప్రపంచకప్‌లో 10 జట్లు పాల్గొననున్నాయి. ఆతిథ్య భారత్‌తో పాటు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్లు తలపడనున్నాయి. వీటిలో చాలా జట్లు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నాయి.

2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లండ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈసారి జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌ జట్టు టైటిల్‌ను కాపాడుకోవాల‌ని ట్రై చేస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 10 టీమ్‌లు.. తమ తమ జట్లను ప్రకటించాయి. జట్లలో మార్పులు చేసేందుకు సెప్టెంబర్ 28 చివరి తేదీ కాగా.. ఇప్పుడు ఏ దేశమైనా తమ జట్టులో మార్పులు చేయాలంటే ముందుగా ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

గురువారం రెండు జట్లు తమ జట్టులో ఒక్కో మార్పును చేశాయి. వీటిలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా తన జట్టులో ఆల్‌రౌండర్ అష్టన్ అగర్ స్థానంలో బ్యాట్స్‌మన్ మార్నస్ లాబుస్‌చాగ్నేని తన జట్టులో చేర్చుకుంది. గాయపడిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో భారత్‌.. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులో చేర్చుకుంది.

10 జట్లలో ఆటగాళ్ల వివ‌రాలు..

ఆఫ్ఘనిస్తాన్

హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఉమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్ హక్, నవ్ హమాన్, ఉక్విల్ హక్.

ఆస్ట్రేలియా

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, షాన్ అబాట్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.

బంగ్లాదేశ్

షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, తంజీద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (వైస్ కెప్టెన్), తౌహీద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, షాక్ మహిదీ హసన్, తస్కిన్ అహ్మద్, తస్కిన్ అహ్మద్ మహమూద్, షోరీఫుల్ ఇస్లాం, తంజీమ్ హసన్ సాకిబ్.

ఇంగ్లండ్

జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.

భారత్‌

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

నెదర్లాండ్స్

స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడే, విక్రమ్ సింగ్, తేజా నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మాన్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.

న్యూజిలాండ్

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్.

పాకిస్తాన్

బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అగా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షహీన్ అఫ్రిది, మొహమ్మద్ అఫ్రిది వాసిం.

దక్షిణాఫ్రికా

టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, కగిసో రబడా, తబ్రైజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాడ్ విలియమ్స్.

శ్రీలంక

దసున్ షనక (కెప్టెన్), కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), కుసాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, లహిరు కుమార, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ్ డి సిల్వా, మహిష్ తిక్షణ, దునిత్ వెల్లాగే, కసున్ రజిత, మతిషా పతిరణక , దుషన్ హేమంత.

Next Story