తెలంగాణ పోలీసు స్టేషన్ల‌న్నింటిలోనూ సీసీటీవీ కెమెరాలు ఉండాల్సిందే

All Telangana Police stations have CCTV cameras govt informs hc. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంగళవారం హైకోర్టు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 July 2023 11:42 AM GMT
తెలంగాణ పోలీసు స్టేషన్ల‌న్నింటిలోనూ సీసీటీవీ కెమెరాలు ఉండాల్సిందే

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌ తెలిపింది. లాకప్ డెత్ లను తగ్గించేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసుల క్రూరత్వం నుంచి అమాయకులను రక్షించేందుకు, మానవ హక్కుల ఉల్లంఘనలపై దాఖలైన పిల్‌ను ధర్మాసనం విచారించగా ఈ తీర్పు వచ్చింది. కొంతమంది పోలీసు అధికారులు అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, లాకప్‌ డెత్‌లు కూడా జరిగాయని.. దీనికి కారణం పోలీస్ స్టేషన్లలో కెమెరాలు లేకపోవడమే కారణమని రాపోలు భాస్కర్‌ అనే న్యాయవాది హైకోర్టుకు లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని 774 పోలీస్ స్టేషన్లలో దాదాపు 369 స్టేషన్లలో సిసి కెమెరాలు ఉన్నాయని హోం శాఖ తరపున న్యాయవాది ఎం రూపేందర్ కోర్టుకు తెలిపారు. మరో 293 పోలీస్ స్టేషన్లలో ఇన్‌స్టాలేషన్ పనులు జరుగుతున్నాయని, రాష్ట్రంలోని 103 పోలీస్ స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్నందున తెలంగాణ హైకోర్టులో కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని రూపేందర్ కోర్టుకు తెలియజేశారు. ఆయన వాదనలతో ఏకీభవించిన సీజే డివిజన్ బెంచ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ముగించింది.

జూలై 8న అంతకుముందు విచారణ సందర్భంగా, రాపోలు భాస్కర్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో మెదక్ జిల్లా, సికింద్రాబాద్‌లోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన లాకప్ డెత్ లను ప్రస్తావించారు.. ఇంకొన్ని మీడియాలో వచ్చిన కేసులను కూడా వాటికి జత చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 780 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో 40 శాతం పనిచేయడం లేదన్నారు.


Next Story