యాదవుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవులను రాజకీయంగా ద్రోహం చేసిన యాదవ వ్యతిరేఖ పార్టీ కాంగ్రెస్ అని
By Medi Samrat Published on 6 Sept 2023 7:24 PM ISTఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవులను రాజకీయంగా ద్రోహం చేసిన యాదవ వ్యతిరేఖ పార్టీ కాంగ్రెస్ అని అఖిల భారత యాదవ్ మహాసభ నేతలు తెలిపారు. ఎన్నడూ యాదవులకు ఏమి చేయని కాంగ్రెస్ పార్టీ, యాదవులను బీఆర్ఎస్ పార్టీకి కి దూరం చేయాలనే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరోసారి సిట్టింగ్ యాదవ శాసన సభ్యులకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా మంత్రి జగదీష్ రెడ్డిని అఖిలభారత యాదవ మహాసభ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. 2018లో యాదవులకు ఒకేఒక అసెంబ్లీ సీటు కేటాయించి కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని మండి పడ్డారు. 2014లో కూడా పోటీ చేసిన నలుగురు యాదవ సోదరులకు చేయిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 2018లో కూడా కాంగ్రెస్-టీడీపీ కూటమిలో యాదవుల స్థానంలో అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించి తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్రను యాదవులు మర్చిపోవద్దు అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదవులకు రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించినందుకు కృతజ్ఞతగా కెసిఆర్ కి మంత్రి జగదీష్ రెడ్డికి రాబోయే ఎన్నికల లో 12 కు 12 అసెంబ్లీ సీట్లు గెలిపించి బహుమతిగా ఇస్తామని తెలిపారు. బలహీన వర్గాల, యాదవ వ్యతిరేకి అయిన కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని స్పష్టం చేశారు. యాదవ కురుమల సాధికారత, ఆర్థిక స్వావలంబనకు కృషి చేసిన నేత సీఎం కేసీఆర్ అని నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు లభించిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా రెండు విడతలుగా 12 వందల కోట్లను కేటాయించడం చారిత్రాత్మక విషయం అన్నారు. గొర్ల పంపిణీ ద్వారా యాదవులు ఆర్థిక స్వాలంబన పొందడమే కాకుండా మాంసం ఉత్పత్తులను గణనీయంగా పెంచడం జరిగిందన్నారు. యాదవులు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడం జరిగింది అన్నారు. 2018 ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ సీట్లు, రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ ఇవ్వడమే బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు యాదవుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం అన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి ప్రోత్సాహం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది అన్నారు. ఇవన్నీ మంత్రి జగదీష్ రెడ్డి యాదవ పక్షపాతి అనడానికి నిదర్శనం అన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్‌కు టికెట్ ఇచ్చి గెలిపించడంలో జగదీశ్ రెడ్డి పాత్ర ఎనలేనిది అన్నారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా బడుగుల లింగయ్య యాదవ్ ని నియమించడం జగదీష్ రెడ్డికి యాదవులపై ఉన్న ప్రేమకు నిలువుటద్దామన్నారు. మంత్రి ప్రోత్సాహంతో డీసీఎంఎస్ చైర్మన్ గా వట్టే జానయ్య యాదవ్ ను నియమించడం జరిగిందన్నారు. దాంతోపాటు మూడు మార్కెట్ కమిటీలను యాదవులను నియమించడం ద్వారా యాదవులపై జగదీష్ రెడ్డికి ఉన్న ప్రేమ అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు యాదవ్, రాష్ట్ర నాయకులు సుధాకర్ యాదవ్, బాలరాజు యాదవ్, రాజారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.