అక్కినేని కుటుంబం గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా కొనసాగుతున్న మంత్రి కొండా సురేఖ-నాగార్జున ఫ్యామిలీ వివాదానికి ఫైనల్‌గా పుల్‌స్టాప్ పడింది. పరువు నష్టం దావాకు సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరుగనున్న నేపథ్యంలో నాగార్జున కేసు విత్‌డ్రా చేసుకున్నాడు.
కోర్డులో విచారణకు ఒక రోజు ముందే అర్థరాత్రి మంత్రి కొండా సురేఖ నాగార్జునకు క్షమాపణలు చెబుతూ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టులోని పరువు నష్టం దావా కేసును నాగార్జున విత్ డ్రా చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి పుల్‌స్టాప్ పడింది.