కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన అక్కినేని నాగార్జున
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై.. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 2 Oct 2024 5:46 PM ISTబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై.. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆరే కారణమని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. పద్దతి పాడు లేకుండా ఇష్టా రీతిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా రెచ్చిపోతుందని ఫైర్ అయ్యారు. దుబాయ్ నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుస్తోందని అన్నారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానంటూ ట్వీట్ లో తెలిపారు. "గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను." అంటూ ఎక్స్ లో పోస్టు పెట్టారు అక్కినేని నాగార్జున.
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2024
సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?" అంటూ విమర్శించారు.