ఇది గాంధీ భవన్ కాదు : అక్బరుద్దీన్ ఫైర్

తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలపై మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat
Published on : 17 March 2025 3:00 PM IST

ఇది గాంధీ భవన్ కాదు : అక్బరుద్దీన్ ఫైర్

తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలపై మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి, కానీ గాంధీ భవన్‌లా కాదని మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఇలా చేయడం సరికాదని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రశ్నలను కూడా మార్చుతున్నారని అసదుద్దీన్ అన్నారు.

సభ నడుపుతున్న తీరును నిరసిస్తూ మజ్లిస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. సభలో మాట్లాడదామంటే మైక్ ఇవ్వడం లేదని అన్నారు. శాసనసభను నడపడంలో ప్రభుత్వం విఫలమైందని, సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది గాంధీ భవన్ కాదు, తెలంగాణ శాసనసభ అని గుర్తుపెట్టుకోవాలని అక్బరుద్దీన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మజ్లిస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

Next Story