ప్రతీ ఇంటికి రాహుల్ గాంధీ సందేశం చేరాలని.. ప్రతీ ఇంటికి హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ అంటించాలని ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ ప్రభుత్వం.. దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఆదానీకి కట్టబెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ధరణి వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నేతలందరూ కలిసికట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. మండల స్థాయి నేతలు హాత్ సే హాత్ జోడో ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. 15 రోజుల తర్వాత మళ్లీ వచ్చి మరోసారి సమావేశం నిర్వహిస్తా.. జిల్లాలలో నిర్వహించే సమావేశాలకు పార్టీ అనుబంధ విభాగాలన్నింటిని పిలవాలని నేతలకు ఆదేశాలు జారీచేశారు. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి.. జోడోయాత్రను కలిసికట్టుగా చేయాలని సూచించారు.