సీఎం, మంత్రుల పనితీరు అద్భుతంగా ఉంది : రోహిత్‌ చౌదరీ

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజాపాలన పట్ల ప్రజల్లో మంచి విశ్వాసం ఉందని ఏఐసీసీ కార్యదర్శి రోహిన్ చౌదరీ అన్నారు.

By Medi Samrat  Published on  22 March 2024 7:15 PM IST
సీఎం, మంత్రుల పనితీరు అద్భుతంగా ఉంది : రోహిత్‌ చౌదరీ

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజాపాలన పట్ల ప్రజల్లో మంచి విశ్వాసం ఉందని ఏఐసీసీ కార్యదర్శి రోహిన్ చౌదరీ అన్నారు. గాంధీ భవన్ లో జ‌రిగిన టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల పనితీరు అద్భుతంగా ఉందని.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామ‌న్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అనుకున్నట్టు నెరవేరుస్తున్నామ‌న్నారు. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మనం మరింతగా ప్రచారంలోకి తీసుకెళ్లి.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మెజారిటీ సీట్లు గెలిపించే విదంగా ప్రణాళిక చేయాలని నేత‌ల‌కు సూచించారు.

ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలలో ప్రచార కమిటీ పాత్ర చాలా కీలకమైనదన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలన ప్రజల్లో ఎలా విశ్వాసాన్ని పెంచిందో మనం ఎలా ప్రజలకు చేరువయ్యమో అలాగే మరింతగా చేరువయ్యి ప్రజలను కాంగ్రెస్ వైపు వచ్చేలా చూడాలని అన్నారు. పకడ్బందీ ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. సమావేశంలో సోషల్ మీడియా కమిటీ చైర్మన్ మన్నే సతీష్, వార్ రూమ్ కమిటీ చైర్మన్ పవన్ మల్లాది తదితరులు పాల్గొన్నారు.

Next Story