మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రం ఇచ్చే నిధుల అసమానతలను పరిష్కరించడానికి కొన్ని దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలకు పిలుపునిచ్చాయి.. దీనికి జనాభా పెరుగుదల పరిష్కారం కాదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు.
By Medi Samrat Published on 31 Jan 2025 8:31 AM ISTకేంద్రం ఇచ్చే నిధుల అసమానతలను పరిష్కరించడానికి కొన్ని దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలకు పిలుపునిచ్చాయి.. దీనికి జనాభా పెరుగుదల పరిష్కారం కాదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మూడో బీపీఆర్ విఠల్ స్మారక ఉపన్యాస సభలో సుబ్బారావు మాట్లాడుతూ.. నేను 50 ఏళ్లుగా ప్రభుత్వ సర్వీసులో పనిచేశాను. నేను మొదట ఉద్యోగంలో చేరినప్పుడు.. జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ మా మొదటి ప్రాధాన్యత అన్నారు. జనాభా పెరుగుదల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని మేము విశ్వసించాము. కానీ, మన జనాభాను పెంచుకోవాలని రాజకీయ నేతలు చెప్పే రోజు చూస్తామని అనుకోలేదన్నారు. జనాభా నియంత్రణ చేసిన కొన్ని రాష్ట్రాలకు కేంద్ర సహాయం అందకుండా పోతున్నాయనేది దాని స్పష్టమైన సందేశమని.. కానీ జనాభా పెరగడం పరిష్కారం కాదని నేను నమ్ముతున్నాను.. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే మనకు జనాభా సమస్య ఉందన్నారు.
గతంలో ఉచితాలను 'రివర్రీ కల్చర్'గా అభివర్ణించిన బీజేపీ.. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పథకాలను ప్రదర్శించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పోటీ పడుతోందని సుబ్బారావు అన్నారు. లక్షలాది మంది ప్రజలు రోజువారీ జీవనం కోసం కష్టపడుతున్న మన దేశంలో, ప్రజలకు సహాయం చేయడం ప్రభుత్వానికి అత్యవసరమని ఆయన అన్నారు. కొన్ని రాష్ట్రాలు మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నాయని.. వారికి సహాయం చేయడానికి ఇదే ఉత్తమమైన మార్గమని.. ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కన్నా.. అదే ఖర్చుతో వారికి మరింత తోడ్పాటును అందించే మరొక పథకం అందించవచ్చేమో ఆలోచించాలని సూచించారు.
జనాభా నిష్పత్తి ఆధారంగా కేటాయింపులను పక్షపాతం లేకుండా తక్షణమే పంపిణీ చేయాలని కోరుతూ.. తెలంగాణ ఇటీవలి ప్రీ-బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి తక్కువ నిధులు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వాలు వినియోగానికి ఉచితంగా డబ్బు ఇవ్వలేవని, అప్పులు చేయలేవని అన్నారు. వికసిత్ భారత్‌కు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన సహకారం కూడా ముఖ్యమని సుబ్బారావు అన్నారు.
ఇదిలావుటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల ఎక్కువ మంది పిల్లలను కనాలని మాట్లాడారు. ఒక తమిళ సామెతను ప్రస్తావిస్తూ.. లోక్‌సభ డీలిమిటేషన్ ప్రజలను "16 మంది పిల్లలను" పెంచడం గురించి ఆలోచించేలా చేయవచ్చని స్టాలిన్ అన్నారు.