బీజేపీ నాయకురాలు విజయశాంతి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరుతారనే ఉహాగానాల నడుమ.. శుక్రవారం బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఆమె సమావేశమయ్యారు. అనంతరం ఆమె కాంగ్రెస్‌లో చేరారు. మల్లికార్జున్ ఖర్గే విజయశాంతికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయశాంతి చేరిక సందర్భంలో ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ భాబు తదితరులు ఉన్నారు.
బండి సంజయ్‌ను బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించిన నాటి నుంచి విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే విజయశాంతి ఎన్నికల బరిలో ఉంటారని రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అమె ఎన్నికల బరిలో లేరు. అప్పటి నుంచి పార్టీ మారుతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే బీఆర్ఎస్ చేరుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి.. అయితే ఆమె మాత్రం కాంగ్రెస్‌కే జై కొట్టారు.