ఫామ్‌హౌస్‌లో అక్రమ కట్టడాలు.. నటుడు అలీకి నోటీసులు

అనుమతులు లేకుండా తన ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలు చేపట్టినందుకు నటుడు అలీకి వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలం గ్రామ పంచాయతీ నుండి నోటీసులు అందాయి.

By Medi Samrat  Published on  24 Nov 2024 3:40 PM IST
ఫామ్‌హౌస్‌లో అక్రమ కట్టడాలు.. నటుడు అలీకి నోటీసులు

అనుమతులు లేకుండా తన ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలు చేపట్టినందుకు నటుడు అలీకి వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలం గ్రామ పంచాయతీ నుండి నోటీసులు అందాయి. నిర్మాణ పనులను నిలిపివేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి నోటీసులు జారీ చేశారు. ఎక్‌మామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌లో ఉన్న ఫాంహౌస్‌కు సంబంధించిన నోటీసులు జారీ చేశారు. నిర్మాణానికి అవసరమైన పత్రాలను సమర్పించి, అవసరమైన అనుమతులు పొందాలని గతంలో అలీకి గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన స్పందించకపోవడంతో పంచాయతీ కార్యదర్శి రెండోసారి నోటీసులు జారీ చేశారు. సంబంధిత పత్రాలను సమర్పించి, అవసరమైన అనుమతులు పొందాలని తాజా నోటీసులో కూడా కోరారు. లేని పక్షంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చ‌రించింది.

Next Story