ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్‌లో ప్రమాదం

ఆదివారం నాడు జనగాం జిల్లా పెంబర్తిలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాన్వాయ్‌తో వెళ్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ప్రమాదానికి గురై బోల్తా పడింది.

By అంజి  Published on  5 Jan 2025 7:29 PM IST
Accident, Deputy Chief Minister Bhatti Vikramarka, convoy, Telangana

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్‌లో ప్రమాదం

ఆదివారం నాడు జనగాం జిల్లా పెంబర్తిలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాన్వాయ్‌తో వెళ్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ప్రమాదానికి గురై బోల్తా పడింది. జనగాం సబ్‌ఇన్‌స్పెక్టర్‌ చెన్నకేశవులు, వాహన డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వరంగల్ పర్యటన లో భాగంగా భట్టి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నారు. మార్గమద్యంలో జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద డిప్యూటీ సీఎం కాన్వాయ్ లోని పోలీస్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్ట పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పోలీసు వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Next Story