తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా అయోధ్యపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో ఏసీబీ అధికారులు దాడి చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) రిటైర్మెంట్ బెనిఫిట్ బిల్లులను సిద్ధం చేసి, ఏజీఏ కార్యాలయానికి పంపేందుకు గాను బాధితుడి నుంచి రూ.15,000 లంచం డిమాండ్ చేసిన ప్రధానోపాధ్యాయుడు జె. రవికుమార్, స్కూల్ అసిస్టెంట్ జి. చంద్రమౌళిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్కూల్ ఆవరణలోనే లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు, చంద్రమౌళి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.