రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు భారీ సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగించారు. శ్రీనివాసులు నివాసంతో పాటు రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఆరు చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా పనిచేస్తూ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక రైస్ మిల్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలుచోట్ల షెల్ కంపెనీల పేర్లతో వ్యాపారాలు నిర్వ హించినట్లు అనుమానాలు వెలువడుతున్నాయి. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయ పరిధిలోని కొన్ని కీలక స్థలాలు కొనుగోలు చేసినట్లుగా అధికారులకు గుర్తించారు.హైటెక్ సిటీలోని మై హోమ్ భుజలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.