ఏసీబీ కోర్టులో మల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి చుక్కెదురయ్యింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని.. ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అదేక్రమంలో ఓటుకు కోట్ల కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని కోర్టు తెలిపింది. అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
ఇదిలావుంటే.. 2015లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉ్న రేవంత్ రెడ్డి.. అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ.50 లక్షలు ఇస్తూ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేఫథ్యంలో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.