సీఎం కేసీఆర్, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే..!

ABVP Leaders protest at TSPSC office over exam paper leak. టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ కారణంగా తెలంగాణలో ఆందోళనలు మిన్నంటాయి

By M.S.R  Published on  15 March 2023 3:21 PM IST
సీఎం కేసీఆర్, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే..!

ABVP Leaders protest at TSPSC office over exam paper leak


టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ కారణంగా తెలంగాణలో ఆందోళనలు మిన్నంటాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పేపర్ లీక్ ఘటనకు నిరసనగా ఏబీవీపీ టీఎస్ పీఎస్ సీ ముట్టడికి ప్రయత్నించింది. TSPSC లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. పేపర్ లీకేజీ ఘటనకు బాద్యత వహిస్తూ, సీఎం కేసీఆర్, టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై ఓయూలో ఆందోళన నెలకొంది. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పేపర్ లీక్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను తొలగించాలని కోరారు. టీఎస్పీఎస్సీ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని, మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయో ఆయా పరీక్షలను రద్దు చేసి మళ్ళీ పరీక్షలను నిర్వహించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు.


Next Story