రేపు ఇంటర్ కళాశాలల బంద్‌.. పిలుపునిచ్చిన‌ ఏబీవీపీ

ABVP has called for inter-college bandh tomorrow. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు ఇంటర్ కళాశాలల బంద్ కు పిలుపును ఇచ్చారు.

By Medi Samrat  Published on  22 Aug 2022 9:22 AM GMT
రేపు ఇంటర్ కళాశాలల బంద్‌.. పిలుపునిచ్చిన‌ ఏబీవీపీ

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు ఇంటర్ కళాశాలల బంద్ కు పిలుపును ఇచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఇంటర్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఇంటర్ విద్యలో కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు, ఆత్మహత్య లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వ నియంత్రించడం లేదని చెబుతూ.. నారాయణగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు.

కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు నిర్వహిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య సహా ఇతర కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలని.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తున్న,అనుమతి లేని కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ర్యాంక్ లను ప్రచారం చేస్తున్న కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని.. అధిక ఫీజులను నియంత్రించి ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని అన్నారు.

Next Story
Share it