బతికి ఉండగానే తన ఫొటోకు.. కీర్తిశేషులు అని రాసి, పూజలు.. మనస్తాపంతో ఆత్మహత్య

A sick man has committed suicide in Khammam district. ఖమ్మం జిల్లాలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి.. తాను బతికి ఉండగానే తన ఫొటోకు కీర్తి శేషులు అని రాయించుకున్నాడు.

By అంజి  Published on  4 Feb 2022 5:55 AM GMT
బతికి ఉండగానే తన ఫొటోకు.. కీర్తిశేషులు అని రాసి, పూజలు.. మనస్తాపంతో ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి.. తాను బతికి ఉండగానే తన ఫొటోకు కీర్తి శేషులు అని రాయించుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫొటోకు పూజలు కూడా చేశాడు. అనారోగ్యం తీవ్రమవడంతో మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏదులాపురంలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాడపల్లి శివప్రసాద్‌ (48).. కొన్నేళ్ల కిందట తెలంగాణకు వలస వచ్చాడు. అప్పటి నుండి విజయవాడ, ఖమ్మంలో ఉంటూ పని చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కోదాడ అడ్డరోడ్డులోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తూ.. ఏదులాపురం వెంపటినగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.

ఫిబ్రవరి 1వ తేదీన ఇంట్లోకి వెళ్లిన శివప్రసాద్‌.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. నిన్న కూడా ఇంటి తలుపులు ఎంతకీ తీయకపోవడంతో.. ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. ఇంటి కిటికీలు తెరిచి చూడగా శివప్రసాద్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఆ వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే శివప్రసాద్‌ గత కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. ఆ బాధ తట్టుకోలేక చనిపోయాడని పోలీసులు చెప్పారు.

Next Story
Share it