రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. కందుకూరు సమీపంలోని పవర్‌గ్రిడ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాచారం మండలం కురుమిద్దకు చెందిన పలువురు కార్మికులు తుక్కుగూడ సమీపంలోని ఓ సోలార్ కంపెనీలో పని చేస్తున్నారు.
రోజువారీలాగే శుక్రవారం నాడు కూడా డ్యూటీ ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న ఆటో అక్కడే రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎం మిల్లర్ వెహికల్‌ను ఢీకొట్టింది. దీంతో ఆట్రో డ్రైవర్ సురిగి శ్రీనివాస్, కురుమిద్దకు చెందిన సత్తెమ్మ, పంది శ్రీదర్ మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.