ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన జిల్లాలోని జైనథ్ మండలం తరోడ సమీపంలో జరిగింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణికులు ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయినట్టు సమాచారం. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తా లేకా.. అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.