హైదరాబాద్‌లోని కాటేదాన్ ఏరియాలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నేతాజీ నగర్‌లోని కార్ రబ్బర్ మాట్స్ తయారు చేసే తిరుపతి రబ్బర్ కంపెనీలో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నం చేసింది. అయితే మంటలు అదుపులోకి రాలేదు. దీనిక తోడు నల్లటి పొగ దట్టంగా వ్యాపించింది.