RangaReddy: ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. కుప్పకూలిన షెడ్డు

రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండల కేంద్రంలో ఉన్న కంసన్ హైజెనిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

By అంజి  Published on  6 Nov 2024 7:20 AM IST
fire, factory, Rangareddy district, Nandigama

RangaReddy: ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. కుప్పకూలిన షెడ్డు

రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండల కేంద్రంలో ఉన్న కంసన్ హైజెనిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసి పడటంతో దట్టమైనపొగలు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టాయి. పొగతో ఉక్కిరి బిక్కిరి అయిన స్థానికులు బయటకు వచ్చి చూస్తుండగానే క్షణాల్లో షెడ్డు పూర్తిగా నేల మట్టం అయిపోయింది.

అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగ లేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తుంచారు. ఐదు ఫైర్ ఇంజన్‌లతో మంటలను సిబ్బంది అదుపు చేశారు. పరిశ్రమ పూర్తిగా అగ్నికి ఆహతి అయ్యింది.

Next Story