ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్‌రావు ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్‌కు సుప్రీం ఆదేశం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది
By - Knakam Karthik |
ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్‌రావు ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్‌కు సుప్రీం ఆదేశం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాగా జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలొ ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని ఆదేశించింది. మరో వైపు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు ఈ కేసులో అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.
కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనలర్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కేసు దర్యాప్తుకు సహకరించడం లేదు. ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు అప్పగించాలి . కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయి. డిజిటల్ డివైసెస్ లో డాటా ఫార్మా చేశారు . ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్క్‌లో డేటా ధ్వంసం చేశారు. కొత్తగా 50 హార్డ్ డిస్కులు అక్కడ పెట్టారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ,జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేశారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ మాకు ఇచ్చారు..అని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు.
అయితే మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ తరపున శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. నేను డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధం. 11 సార్లు పిలిచారు 80 గంటల పాటు విచారణ జరిపారు. నేను డిలీట్ చేయలేదు డిపార్ట్మెంట్ డిలీట్ చెసింది. నేను డిపార్ట్‌మెంట్‌లో ఒకడిని కాదు. నన్ను జైల్లో పెడతానని ముఖ్యమంత్రి బాహటంగా బెదిరించారు ..అని ప్రభాకర్ రావు తరపున శేషాద్రి నాయుడు వాదించారు.