టీపీసీసీ చీఫ్‌తో సీపీఐ నాయకుల బృందం సమావేశం..ఎందుకంటే?

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం సీపీఐ ప్రతినిధుల బృందం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌, సీఎం సలహాదారు నరేందర్‌రెడ్డితో సమావేశం అయ్యారు

By -  Knakam Karthik
Published on : 7 Oct 2025 3:13 PM IST

Telangana, Local Body Elections, Congress, Cpi Leaders, Tpcc Chief

టీపీసీసీ చీఫ్‌తో సీపీఐ నాయకుల బృందం సమావేశం..ఎందుకంటే?

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం సీపీఐ ప్రతినిధుల బృందం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌, సీఎం సలహాదారు నరేందర్‌రెడ్డితో సమావేశం అయ్యారు. కాగా ఈ సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, జాతీయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, కలవెని శంకర్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రెండు పార్టీల నాయకులు చర్చించినట్లు సమాచారం.

Next Story